పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4)
ఆదరణ కర్తా సమాధాన కర్త (2)
సర్వ సత్యములోనికి నడిపే
మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా||
స గ గ గ గ మ గ రి స ని ద ప
స గ గ గ గ మ గ ని గ మ
స గ గ గ గ మ గ రి స ని ద ప
ప ద ని రి స.. రి స
మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము
సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2)
శక్తి చేత కానే కాదు
బలముతోను కానే కాదు (2)
నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు
నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా||
దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము
పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2)
ఆత్మ గల వాడే దేవుని వాడు
ఆత్మ మూలముగా జీవించును (2)
విజ్ఞాపనమును చేయును మన పక్షముగా
సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||